Kaviti: పాఠశాల విద్యార్థులకు పూర్వ విద్యార్థి డైరీల పంపిణీ
Kaviti: కవిటి మండలం దూగానపుట్టుగ మోడల్ పాఠశాల విద్యార్థులకు పూర్వ విద్యార్థి, వైద్యుడు డాక్టర్ బి. ధర్మేంద్ర డైరీలను పంపిణీ చేసి స్ఫూర్తినింపారు.
Kaviti: పాఠశాల విద్యార్థులకు పూర్వ విద్యార్థి డైరీల పంపిణీ
కవిటి: కవిటి మండలం దూగానపుట్టుగ గ్రామంలోని మోడల్ ప్రాథమిక పాఠశాలలో శనివారం సేవాభావానికి నిదర్శనంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రస్తుతం వైద్యుడిగా ఉన్నత స్థాయిలో స్థిరపడిన డాక్టర్ బి. ధర్మేంద్ర పాఠశాలలోని 65 మంది విద్యార్థులకు డైరీలను అందజేశారు.
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, విద్యతో పాటు మంచి విలువలను అలవర్చుకోవాలని డాక్టర్ ధర్మేంద్ర సూచించారు. గ్రామ పెద్దలు, యువకులు, తల్లిదండ్రుల సమక్షంలో డైరీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు జోష్నా, ఉపాధ్యాయులు బుడ్డెపు కామేష్ రెడ్డి, దుగాన హేమారావు, నూకరాజు, గంగారావు, సిసింద్రీ, గిరి, మహిళలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Next Story




