Kaviti: కవిటి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పూర్వ విద్యార్థుల విరాళం!

Kaviti: శ్రీకాకుళం జిల్లా కవిటి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 2004-06 బ్యాచ్ పూర్వ విద్యార్థులు రూ.30 వేల విలువైన ఫర్నిచర్ విరాళంగా అందజేశారు.

G.RAMBABU, SOMPET
Published on: 25 Aug 2026 10:55 PM IST
Kaviti
X

Kaviti: కవిటి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పూర్వ విద్యార్థుల విరాళం!

కవిటి: తాము చదువుకున్న కవిటి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పూర్వ విద్యార్థులు బీరువా, కుర్చీలను మంగళవారం విరాళంగా అందజేశారు. 2004 - 2006 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు మంగళవారం సుమారు రూ. 30 వేల విలువైన బీరువా, కుర్చీలను కళాశాల ప్రిన్సిపాల్ కే సింహాచలం నాయుడు, అధ్యాపకులకు అందజేశారు.

విద్య నేర్పిన కళాశాల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో సామాజిక బాధ్యతలో భాగంగా ఈ విరాళం అందజేసినట్లు పూర్వ విద్యార్థులు బార్ల సతీష్, పోలాకి మణిబాబు, సత్యానందరౌళో, పూడి సందీప్, బల్లెడ దిలీప్ కుమార్, బడే వెంకటేష్ తెలిపారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కే సింహాచలం నాయుడు మాట్లాడుతూ, 20 ఏళ్ల క్రితం చదువుకున్న విద్యార్థులు తాము చదువుకున్న కళాశాలను గుర్తుంచుకుని సహాయం అందించడం గర్వించదగ్గ విషయమన్నారు.

పూర్వ విద్యార్థులందరూ ఇలాగే సహకరిస్తే కళాశాలను మోడల్ కళాశాలగా తీర్చిదిద్దొచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు యూ ఝాన్సీరాణి, జీ విష్ణుమూర్తి, పీ హరి, కే ఉగాది నాయుడు, డీ అనసూయ, బీ శ్రీనుబాబు, జే పాపారావు, కే కరుణశ్రీ, డీ రమేష్, బీ అంజన, డీ జనార్ధనరావు తదితరులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story