Patapatnam: పాతపట్నం నూతన సీఐగా కిల్లి వెంకటరావు బాధ్యతల స్వీకరణ!

Patapatnam: శ్రీకాకుళం జిల్లా సరిహద్దు నియోజకవర్గ కేంద్రమైన పాతపట్నం పోలీస్ సర్కిల్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) గా కిల్లి వెంకటరావు బాధ్యతలు స్వీకరించారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM
Published on: 15 July 2026 11:25 AM IST
Patapatnam
X

Patapatnam: పాతపట్నం నూతన సీఐగా కిల్లి వెంకటరావు బాధ్యతల స్వీకరణ!

Patapatnam: శ్రీకాకుళం జిల్లా సరిహద్దు నియోజకవర్గ కేంద్రమైన పాతపట్నం పోలీస్ సర్కిల్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ (సిఐ) గా కిల్లి వెంకటరావు బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం నుండి బదిలీపై పాతపట్నం వచ్చిన ఆయనకు పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు స్థానిక ప్రముఖులు ఘనస్వాగతం పలికారు.

ఇప్పటివరకు ఇక్కడ సిఐగా విధులు నిర్వర్తించి, ప్రజాదరణ పొందిన సన్యాసినాయుడు శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస సర్కిల్‌కు బదిలీ కావడంతో, ఆయన స్థానంలో కిల్లి వెంకటరావు బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా నూతన సిఐ కిల్లి వెంకటరావు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పాతపట్నం సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు తాము మొదటి ప్రాధాన్యత ఇస్తామని, సమాజంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు సాగినా సహించేది లేదని స్పష్టం చేశారు.

ముఖ్యంగా ఒడిశా సరిహద్దు ప్రాంతం కావడంతో గంజాయి, ఇతర నిషేధిత ఉత్పత్తుల రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచుతామని, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ వ్యవస్థ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ప్రజలు తమ సమస్యలను నిస్సంకోచంగా పోలీసుల దృష్టికి తీసుకురావచ్చని,

బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. నేరాల నియంత్రణలో మరియు సమాజంలో శాంతి సామరస్యాలను కాపాడటంలో ప్రజలు, యువత పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన కోరారు. అనంతరం పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించి, సిబ్బందితో మాట్లాడి సర్కిల్ పరిధిలోని లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై ప్రాథమిక సమీక్ష నిర్వహించారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

Next Story