Amadalavalasa: ఆమదాలవలస కృష్ణాపురం సెంటర్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు!

Amadalavalasa: ఆమదాలవలస కృష్ణాపురంలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.. యువత ఉత్సాహంగా పాల్గొన్న ఉట్టి కొట్టే కార్యక్రమం.

P.RAMMOHAN, AMADALAVALASA
Published on: 5 Sept 2026 5:31 PM IST
Amadalavalasa
X

Amadalavalasa: ఆమదాలవలస కృష్ణాపురం సెంటర్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు!

Amadalavalasa: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కృష్ణాపురం యువత శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కృష్ణాపురం పెద్దలు మాట్లాడుతూ ఆ రోజుల్లో బుల్లి కృష్ణుడి ఆగడాలనుంచితప్పించుకోవడానికి చాలా మంది తమపాలు, పెరుగు ఉట్టిలో పెట్టిఅందకుండాపైనకట్టేవాళ్లు.

అయితే కృష్ణుడు చాలాచిలిపిగాతనస్నేహితులను ఒంగోబెట్టివాళ్లపైకి ఎక్కిఉట్టిలోనిపాలు,పెరుగునుదొంగతనం చేసి తినేవాడు. ఆనాటి కృష్ణుడిగురించి పలువురికి చాటిచెప్పేందుకు,ముఖ్యంగా ఇప్పటి బాలలకు కృష్ణుడి అల్లరిగురించితెలియజేసేందుకు కృష్ణుడిజన్మదినమైన రోజు ఉట్లు ఏర్పాటు చేసివాటిని పగలకొట్టి సంతోషిస్తుంటారు.

అందుకనే శ్రీకృష్ణుడి చిలిపి చేష్టాలు గుర్తుకువచ్చేలా.. కృష్ణుడి అల్లరిని ఈ తరం వారికితెలియజేసేలా కృష్ణుని జన్మదినం రోజుఉట్లు పగలగొట్టి సంతోషిస్తుంటారు. అని చెప్పారు. అలాగేఎవరు అయితే ఉట్టిని విజయవంతంగా కొడతారో (పగలగొడతారో) వారికి ప్రత్యేక బహుమతులు, నగదు బహుమతులు అందజేశారు .ఈ కార్యక్రమంలో కృష్ణాపురం గ్రామ ప్రజలు , యువత పాల్గొన్నారు.

P.RAMMOHAN, AMADALAVALASA

P.RAMMOHAN, AMADALAVALASA