Srikakulam: కిమిడి వ్యాఖ్యలపై చిన్న శ్రీను ఫైర్!

Srikakulam: రాజాంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో టీడీపీ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు వ్యాఖ్యలపై విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు.

SRIDHAR, RAJAM
Published on: 2 April 2026 12:05 PM IST
Srikakulam
X

Srikakulam: కిమిడి వ్యాఖ్యలపై చిన్న శ్రీను ఫైర్!

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా:- చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు వ్యాఖ్యలపై విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) తీవ్రంగా స్పందించారు. బుధవారం రాజాం పట్టణంలోని వెంకట దుర్గా కళ్యాణ మండపంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి నిర్మాణంపై వైసీపీ అవగాహనలేని వ్యాఖ్యలు చేస్తోందని కిమిడి కళా వెంకటరావు చేసిన విమర్శలను తప్పుబట్టారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.

మూలపేట పోర్టు, భావనపాడు జెట్టి వంటి ప్రాజెక్టులపై టీడీపీ కృషి చేస్తోందన్న వ్యాఖ్యలు నిజం కాదని పేర్కొన్నారు. వైసీపీ పాలనలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. అమరావతి పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు మేలు చేశాయని తెలిపారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయ విమర్శలు చేయడం సరికాదని చిన్నశ్రీను అన్నారు.

SRIDHAR, RAJAM

SRIDHAR, RAJAM

Next Story