Srikakulam: అథ్లెటిక్స్ పోటీలకు మాణిక్యపురం విద్యార్థిని సమీరా ఎంపిక!
Srikakulam: శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం మాణిక్యపురం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని సమీరా జాతీయ/రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది.
Srikakulam: అథ్లెటిక్స్ పోటీలకు మాణిక్యపురం విద్యార్థిని సమీరా ఎంపిక!
శ్రీకాకుళం: కవిటి మండల పరిధిలోని మాణిక్యపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని సమీరా జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది. శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలో అండర్-17 విభాగం జావెలిన్ త్రో ఈవెంట్ లో సమీరా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించింది.
ఈ నెల 24 నుంచి 27 వరకు తిరుపతి వేదికగా జరగే "రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్ షిప్ 2026" పోటీలో సమీరా జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైకుంఠరావు తెలిపారు. సాధారణ గ్రామీణ పాఠశాల విద్యార్థిని రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపిక కావడం పట్ల హెచ్ఎం వైకుంఠరావు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగే పోటీలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వ్యాయామ ఉపాధ్యాయులు రవికుమార్ మహంతి, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది ఆకాంక్షించారు.




