Parvathipuram: వర్షాకాలం వేళ దోమలపై యుద్ధం: ఆయుష్ అధికారి డాక్టర్!
Parvathipuram: డోకిశీల, బంధలుప్పి పి.హెచ్.సిల పరిధిలోని 35 వేల మందికి జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ బి.సుశీల మలేరియా నివారణ హోమియోపతి మందులను పంపిణీ చేశారు.
Parvathipuram: వర్షాకాలం వేళ దోమలపై యుద్ధం: ఆయుష్ అధికారి డాక్టర్!
పార్వతీపురం: గిరిజన ప్రాంతాల్లో మలేరియా నిర్మూలనే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందని జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ బి.సుశీల తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు మలేరియా రాకుండా ముందస్తు నివారణ మందులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
ఈ మేరకు మన్యం జిల్లాలోని డోకిశీల, బంధలుప్పి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గల ప్రజలందరికీ మలేరియా నివారణ హోమియోపతి మందులను ఆమె మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగానే ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు.
డోకిశీల పి.హెచ్.సి పరిధిలో ఉన్న మొత్తం 19,900 మంది జనాభాకు, అలాగే బంధలుప్పి పి.హెచ్.సి పరిధిలోని మొత్తం 16,000 మంది జనాభాకు మలేరియా నివారణ మందులను అందజేస్తున్నామన్నారు. మలేరియా నివార




