Kanchili: భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక కుంకుమార్చనలు!

Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి భజన మందిరం వద్ద వినాయక చవితి సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక కుంకుమ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

G.RAMBABU, SOMPET
Published on: 15 Sept 2026 9:25 PM IST
Kanchili
X

Kanchili: భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక కుంకుమార్చనలు!

కంచిలి: కంచిలి పట్టణంలోని మఠం కంచిలిలో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. భజన మందిరం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక పూజా మండపం వద్ద మంగళవారం మహిళలతో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పూజా మండపానికి చేరుకుని భక్తిభావంతో పూజల్లో పాల్గొన్నారు.

వినాయకుని విగ్రహానికి ప్రత్యేక అలంకరణ చేసి, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ కుంకుమ పూజలు జరిపించారు. మహిళలు గణపతి నామస్మరణ చేస్తూ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో భజన మందిరం కమిటీ సభ్యులు, స్థానిక మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఏడాది వినాయక చవితి సందర్భంగా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందిస్తున్నామని కమిటీ నిర్వాహకులు తెలిపారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET