Hiramandalam: హిరమండలంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల భారీ ర్యాలీ
Hiramandalam: పాతపట్నం నియోజకవర్గం హిరమండలంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
Hiramandalam: హిరమండలంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల భారీ ర్యాలీ
హిరమండలం: పాతపట్నం నియోజకవర్గం, హిరమండలం మండలంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు భారీ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. హిరమండలం R&R కాలనీలోని శుభలయ నుంచి పాత హిరమండలం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో హిరమండలం 1, 2, 3, 4 ఎంపీటీసీ సెగ్మెంట్లకు చెందిన ఎన్డీఏ కూటమి అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హిరమండలం మండల జడ్పీటీసీ కూటమి బీజేపీ అభ్యర్థి సిరిపురం త్రివేణి కి కమలం పువ్వు గుర్తుపై, ఎంపీటీసీ కూటమి అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు మరియు కూటమి ముఖ్య నాయకులు మాట్లాడుతూ.. హిరమండలం మండల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా మండలంలో తాగునీటి సమస్య ప్రధాన సమస్యగా ఉందని, ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అవసరమైన నిధులు సమకూర్చి మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, హిరమండలం–4 ఎంపీటీసీ అభ్యర్థి పొగిరి బుచ్చిబాబు, టీడీపీ మండల అధ్యక్షులు దారపు ఢిల్లేశ్వరరావు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు యాళ్ల నాగేశ్వరరావు , పట్టణ మండల అధ్యక్షులు పోతురాజు శ్రీధర్, తెలుగుదేశం సీనియర్ నాయకులు లాడి కృష్ణ , హిరమండలం–3 ఎంపీటీసీ అభ్యర్థి సాహుకారి మంగమ్మ, హిరమండలం–2 అభ్యర్థి గొంటి అప్పయ్య, హిరమండలం–1 అభ్యర్థి గుంటుముక్కల పద్మ, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




