Palakonda: రక్తదాన శిబిరానికి విశేష స్పందన.. రక్తం దానం చేసిన డిఎస్పీ!

Palakonda: ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా కోడదుర్గలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన. స్వయంగా రక్తదానం చేసిన డిఎస్పీ రాంబాబు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 14 Jun 2026 12:20 PM IST
Palakonda
X

Palakonda: రక్తదాన శిబిరానికి విశేష స్పందన.. రక్తం దానం చేసిన డిఎస్పీ!

పాలకొండ: రక్తదాన శిబిరానికి విశేషస్పందన ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా ఆదివారం కోడదుర్గ ఆలయ సమీపంలో కళ్యాణ మండపంలో నగర పంచాయతీ సమన్వయకర్త (పల్లా కొండలరావు) పరివేక్షణలో రక్తదానం శిబిరం జరగగా విశేష స్పందన లభించింది.

డి.ఎస్.పి ఎం రాంబాబు రక్త దాన శిబిరాన్ని ప్రారంభించి రక్తం కూడా దానం చేశారు ప్రతి ఒక్కరూ రక్తం దానం చేయాలని కోరారు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని రక్తం అవడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదేనా అన్నారు.

ఏడాదికి ఒకసారి రక్తం దానం చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు నగర పంచాయతీ సమన్వయకర్త కొండలరావు మాట్లాడుతూ ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తం దానం చేయాలన్నారు సుమారు వందమందికి పైగా రక్తం దానం చేశారు.

ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ నూకరాజు ఏరియా సూపరిండెంట్ కే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వైద్యులు శివ ప్రకాష్ సిఐటియు జిల్లా అధ్యక్షులు దావల రమణారావు టిడిపి పట్టణ అధ్యక్షులు గుమ్మడి సింహాద్రి కడగల రమణ తుమ్మ గుంట శంకర్రావు అడపా బాబ్జి తదితరులు ఉన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story