Palakonda: పాలకొండలో “మీ పోలీస్ – మీకు తెలుసా?” ప్రచార పోస్టర్ ఆవిష్కరణ!

Palakonda: ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి ఆదేశాలతో పాలకొండలో “మీ పోలీస్ – మీకు తెలుసా?” ప్రచార పోస్టర్‌ను మున్సిపల్ కమిషనర్, సీఐ ఆవిష్కరించారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 12 Aug 2026 3:39 PM IST
Palakonda
X

Palakonda: పాలకొండలో “మీ పోలీస్ – మీకు తెలుసా?” ప్రచార పోస్టర్ ఆవిష్కరణ!

Palakonda: “మీ పోలీస్ – మీకు తెలుసా?” అనే కార్యక్రమ ప్రచార పోస్టర్ ను పాలకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ పాలకొండ, MPDO పాలకొండ, వారి సమక్షంలో ఆవిష్కరించారు. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే,విద్యార్థులు చట్టాలు పట్ల ,పోలీస్ విధులు పట్ల ఏ పాటి అవగాహన కలిగి ఉన్నారో తెలుసుకునేందుకు నిర్వహించే పరీక్ష .

ఈ కార్యక్రమం ద్వారా 21 సంవత్సరాల లోపు విద్యార్థిని, విద్యార్థులకు పాలకొండ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సైబర్ నేరాలు, గంజాయి మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగం, రహదారి భద్రత, మహిళలపై నేరాల నివారణ, మానవ అక్రమ రవాణా నివారణ, పోలీస్ శాఖ విధులు తదితర అంశాలపై పోటీ పరీక్ష నిర్వహించనున్నారు. పోటీలో మొత్తం 30 ఆబ్జెక్టివ్ టైప్ (Multiple Choice) ప్రశ్నలు ఉంటాయి. పోటీలో పాల్గొనే విద్యార్థులు, యువత సమాధానాలను 30 నిముషాల లలో సమర్పించాలి.

మొత్తం 30 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి.

ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మొదటి, రెండవ మరియు మూడవ బహుమతులు అందజేయనున్నారు. జవాబు పత్రాలను స్వీకరించేందుకు ఒక డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేయనున్నారు.

పరీక్ష లో పాల్గొనే 21 సంవత్సరాల లోపు విద్యార్థులు తే 14-08-2026ది న ఉదయం 10.00 గంటలకు పాలకొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆవరణలో హాజరు అయి, గంట ముందు రిజిస్ట్రేషన్ చేయించు కోవాలి. ఈ సందర్భంగా ఒక ప్రచార పోస్టర్ ను పాలకొండ పోలీస్ వారు మున్సిపల్ కమిషనర్ పాలకొండ, MPDO పాలకొండ, పాలకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ A. ప్రసాద్ రావు గారు, ఎస్ ఐ,డి. వెంకన్న గారు పాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story