Kaviti: కవిటి మండలంలో స్నేహితుడి జ్ఞాపకార్థం మెగా రక్తదాన శిబిరం!

Kaviti: శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బల్లిపుట్టుగ గ్రామంలో స్నేహితుడి జ్ఞాపకార్థం తలసేమియా బాధితుల కోసం మెగా రక్తదాన శిబిరం.

G.RAMBABU, SOMPET
Published on: 13 Aug 2026 9:03 PM IST
Kaviti
X

Kaviti: కవిటి మండలంలో స్నేహితుడి జ్ఞాపకార్థం మెగా రక్తదాన శిబిరం!

కవిటి: ఆడుతూ పాడుతూ కలిసి తిరిగిన స్నేహితుడు దూరమవడంతో.. అతని జ్ఞాపకార్థం ప్రతి ఏడాది ఆగస్టు 13న తలసేమియా పిల్లలకు మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ స్ఫూర్తితో ఈరోజు కవిటి మండలం బల్లిపుట్టుగ గ్రామంలో ప్రాణదాత బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

స్నేహితుడికి ఘన నివాళి అర్పించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుమారు 30 మందికి పైగా రక్తదాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని తలసేమియా, రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలకు అందించనున్నారు.

రక్తదానం చేయడం అంటే ప్రాణం పోయడం లాంటిదని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాళీ సాహు, బార్ల ప్రదీప్, విశ్వస్, బెందలం రామ్ తో పాటు చలపతి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story