Srikakulam: శ్రీకాకుళంలో పవన్ కల్యాణ్ పుట్టినరోజు అభిమానుల రక్తదానం!
Srikakulam: పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా శ్రీకాకుళంలో మెగా అభిమానుల ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం. ప్రారంభించిన అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్.
Srikakulam: శ్రీకాకుళంలో పవన్ కల్యాణ్ పుట్టినరోజు అభిమానుల రక్తదానం!
Srikakulam: అభిమానం అంటే కటౌట్లు కట్టడం కాదు.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం! అభిమానమంటే నినాదాలు చేయడం కాదు.. ఓ ప్రాణాన్ని నిలబెట్టేందుకు రక్తం ఇవ్వడం! పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శ్రీకాకుళం మెగా అభిమానులు ఇదే సందేశాన్ని ఇచ్చారు. వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా ప్రజాసేవకు వేదికగా మార్చారు.
రక్తదానం, పర్యావరణ పరిరక్షణ, ప్రత్యేక పూజలతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ శిబిరాన్నిఅఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను తొలుత రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్తదానం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకి ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికలను అందజేసారు.
రక్తదాతలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మెగా స్టార్ చిరంజీవి ఇచ్చిన స్పూర్తితో మెగా అభిమానులు రక్తదానం చేసేందుకు ఎప్పుడు ముందుఉంటారన్నారు. అన్నయ్య చిరంజీవి పిలుపు మేరకు సేవా కార్యక్రమాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు.




