Bobbili: ఘనంగా మెగా జాబ్ మేళా.. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు!
Bobbili: విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది. 21కి పైగా కంపెనీలు పాల్గొనగా, వందలాది మంది యువత ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.
Bobbili: ఘనంగా మెగా జాబ్ మేళా.. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు!
Bobbili: విద్వాన్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ, కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా ఘనవిజయం సాధించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ రెడ్డి మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. సాయికిరణ్ యాదవ్, హెచ్‌ఆర్ హెడ్ విద్యాసాగర్ మాట్లాడుతూ జాబ్ మేళాకు యువత నుంచి విశేష స్పందన లభించిందన్నారు.
విప్రో, ఐసీఐసీఐ, బంధన్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, టాటా ఇన్‌ఫ్రా, ఫార్మా కంపెనీలతో కలిపి 21కు పైగా సంస్థలు పాల్గొనగా, 120 మందికి పైగా అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారికి వారం రోజుల్లో నియామక పత్రాలు అందజేస్తామని, ఎంపిక కాని వారు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు నవీన్, హేమంత్తో పాటు కళాశాల సిబ్బంది, కంపెనీల హెచ్‌ఆర్ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




