Meliaputti: మెలియాపుట్టి గిరిజన యువతకు ప్రభుత్వ పథకాలపై అవగాహన
Meliaputti: మెలియాపుట్టి వెలుగు సెంటర్‌లో గిరిజన యువతకు శిక్షణ. ప్రభుత్వ పథకాలు, అటవీ హక్కుల చట్టం, ఆడపిల్లల అజీమ్ ప్రేమ్‌జీ స్కాలర్‌షిప్‌పై అవగాహన.
Meliaputti: మెలియాపుట్టి గిరిజన యువతకు ప్రభుత్వ పథకాలపై అవగాహన
మెలియపుట్టి: శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండల కేంద్రంలో ప్రస్తుతము అమలు అవుతున్న ఆదివాసీ గిరిజను లుకు సంబందించిన ప్రభుత్వ పథకాలు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, పెన్షన్, తల్లికి వందనం, ఉపాధి హామీ మొదలగు పథకాలు సంబందించిన అర్హత, అప్లికేషన్స్ పెట్టె విధానం, కావలిసిన డాకుమెంట్స్ గురించి వివరంగా శిక్షణ లో చెపుతు మరియు వాటిని పొందే మార్గాలు, గురించి వివరించారు అని ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జె వి రమణ తెలియజేస్తూ అదేవిదంగా యూత్ మొబైల్ ను ఉపయోగం చేసుకొని ఏవిధంగా పథకం స్టేటస్ తెలుకోవొచ్చు అన్నది ఆధార్ డౌన్లోడ్ చేసుకొనే విధానం మొదలగు విషయాలు పైన యూత్ కు అవగాహన చేయటం తో పాటు అటవీ హక్కు చట్టం 2006 ఏమి చెపుతుంది.
వ్యక్తి గత పట్టా ఏవిధంగా పొందాలని,. అలాగే సామూహిక పట్టా ఏవిధంగా పొందాలని దానికి సంబందించిన ప్రాసెస్ గురించి కూడ అవగాహన కల్పించడం జరిగింది. ఈ శిక్షణ ద్వారా యువత ను చైతన్య పరచి వాళ్ళ ద్వారా వాళ్ళ గ్రామం లు అభివృద్ధి చెందేలా ప్రయత్నం చేస్తున్నాం అని ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రమణ తెలియజేసారు. అదేవిదంగా అజీమ్ ప్రేమ్ జీ సహాయం తో మన ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లలు కు ప్రత్యేకంగా స్కాలర్షిప్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అర్హత
1. ఇది కేవలం ఆడపిల్లలు
2. 10 వ మరియు ఇంటర్ ప్రభుత్వ స్కూల్ లో తప్పనిసరిగా చదవాలి
3. St, sc మరియు obc వాళ్ళుకు వర్తిస్తుంది
4. ఏదైనా డిగ్రీ లో ఫస్ట్ ఇయర్ జాయిన్ ఐవుండాలి (ప్రభుత్వ లేదా ప్రెవేట్ ). ఈ అర్హత వున్నవాళ్లు స్కాలర్ షిప్ కు అప్లై చేయవొచ్చు అని శిక్షణ ద్వారా యూత్ కు తెలిజేశారు.
వాటి వివరాలు తెలియజేసారు. అప్లికేషన్స్ ఈ నెల చివరి వరకు వుంది ఫస్ట్ ఫేస్ కు సంబందించి, ఒక వేళ ఇప్పుడు పెట్టలేదు అనుకుంటే మరల వచ్చే జనవరి 1 నుండి 31 వరకు రెండో ఫేస్ లో పెట్టండి. ఈ స్కాలర్ షిప్ ద్వారా ఒక సంవత్సరం కు 30000/- ముప్పై వేలు చెప్పున్న డిగ్రీ పూర్తి ఐన వరకు వస్తుంది దీన్ని అందరు ఉపయోగించుకోవాలి అని ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రమణ తెలియజేసారు. ఈ కార్యక్రమం మెలియాపుట్టీ, వెలుగు రిసోర్స్ సెంటర్ లో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వెలుగు ఏ పి ఎం త్రినాధమ్మ పాల్గొని వెలుగు ద్వారా అమలు అవుతున్న పథకాలు గురించి యువత కు వివరించారు. ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశం రమణ మాట్లాడుతూ ఈ ఏరియాలో ఉన్న ఆదివాసీ యువత వాళ్ళ గ్రామంలో ఉన్న సమస్య లను వాళ్ళు పరిష్కరించాలని దానికి తగిన సామర్ధ్యం ఎప్పటికప్పుడు బ్రెడ్స్ అందిస్తూ ఉంటుంది.
ఈ కార్యక్రమం లో 17 గిరిజన గ్రామం లనుండి 39 మంది యువత పాల్గొన్నారు. రిసోర్స్ పర్సన్లుగా సంతోష్, ధర్మారావు మరియు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.




