Kanchili: విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకే నో బ్యాగ్ డే ఎంఈఓల వెల్లడి

Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగాం ZPHS పాఠశాలలో ‘నో బ్యాగ్ డే’ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.

G.RAMBABU, SOMPET
Published on: 18 July 2026 5:13 PM IST
Kanchili
X

Kanchili: విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకే నో బ్యాగ్ డే ఎంఈఓల వెల్లడి

కంచిలి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులపై పుస్తక భారాన్ని, మానసిక ఒత్తిడిని తగ్గించి సృజనాత్మకతను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నో బ్యాగ్ డే’ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కంచిలి మండలం బూరగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 6వ తరగతి విద్యార్థులతో ఎంఈఓ - 1, 2 శివరాం ప్రసాద్, చిట్టిబాబు ముచ్చటించారు.

‘నో బ్యాగ్ డే’ విధానం ద్వారా విద్యార్థులు స్కూలుకు పుస్తకాలు, బ్యాగులు తీసుకెళ్లకుండా ఆటలు, పాటలు, ప్రాజెక్టులు మరియు ఇతర సృజనాత్మక కార్యక్రమాల ద్వారా చదువుపై శ్రద్ధ పెంచే అవకాశం కలుగుతుందని MEO లు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు సోమేశ్వరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు హిందీ భాషకు సంబంధించిన రెడినెస్ ప్రోగ్రాంలోని పాఠాన్ని ఆధారంగా ప్లే కార్డులు, కిరీటాలు ధరించారు.

పండ్ల గొప్పతనం, ఆరోగ్యకరమైన అంశాలపై విద్యార్థులు ఆసక్తికరంగా చర్చించారు. 6వ తరగతి విద్యార్థులు నందిత, వర్షిత, యజ్ఞశ్రీ, లౌక్య నాట్యం చేసి మిగతా విద్యార్థులను ఆకట్టుకున్నారు. ప్రతి శనివారం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరుగుతుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిరంజన్, ఖడంగా, రోజారాణి, గణేష్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story