Palakonda: పాలకొండలో విషాదం.. వడదెబ్బకు ఉపాధి కూలీ బలి
Palakonda: పాలకొండ మండలం భాసూరు గ్రామంలో ఉపాధి హామీ పనులకు వెళ్లిన కోమటి పుష్పనాథం (62) వడదెబ్బతో మృతి చెందారు.
Palakonda: పాలకొండలో విషాదం.. వడదెబ్బకు ఉపాధి కూలీ బలి
పాలకొండ: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం భాసూరు గ్రామానికి చెందిన ఉపాధి కూలీ కోమటి పుస్పనాధం (62) వడదెబ్బకు గురై అక్కడికక్కడే మరణించారు. ఈయనకు భార్య..ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎస్ సి సామాజిక వర్గానికి చెందిన మృతుడు పుస్పనాధం మరణ వార్త విని భాసూరు గ్రామ వాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. తోటి ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీలు అంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. మరియు ఉపాధి హామీ పథకం పథక సంచాలకులు కె. రామచంద్రరావు లు మరణ వార్త తెలిసిన వెంటనే స్పందించి మృతిని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకం సిబ్బంది అంతా సంతాపం వ్యక్తం చేశారు.
Next Story




