Srikakulam: జిల్లా సమగ్రాభివృద్ధిపై మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక సమీక్ష!

Srikakulam: శ్రీకాకుళంలో కలెక్టర్, అధికారులతో జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 1 Oct 2026 3:47 PM IST
Srikakulam
X

Srikakulam: జిల్లా సమగ్రాభివృద్ధిపై మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక సమీక్ష!

Srikakulam: జిల్లా సమగ్రాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌లతో ప్రత్యేకంగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు, పథకాల ప్రయోజనాలను అర్హులైన లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. గ్రామాల్లో చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేసి, వాటి పురోగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు.

రైతు సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం

రైతులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.

కొత్త పింఛన్లు, ఇళ్ల మంజూరుపై కార్యాచరణ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేయనున్న పింఛన్లు, నివాస గృహాల ప్రయోజనాలు అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా చేరేలా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు. అర్హుల గుర్తింపు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని తెలిపారు.

ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పిస్తూ, వాటి ప్రయోజనాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.