Parvathipuram: పాచిపెంటలో ₹36 లక్షలతో నిర్మించి MEO కార్యాలయం ప్రారంభం

Parvathipuram: మన్యం జిల్లా పాచిపెంటలో ₹36 లక్షలతో నిర్మించిన నూతన MEO భవనాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించి, ట్రైసైకిళ్లు, యూపీఎస్‌లు పంపిణీ చేశారు.

B VENKATESH, SALURU
Published on: 27 July 2026 12:42 PM IST
Parvathipuram
X

Parvathipuram: పాచిపెంటలో ₹36 లక్షలతో నిర్మించి MEO కార్యాలయం ప్రారంభం

పార్వతిపురం మన్యం జిల్లా

పాచిపెంట మండలంలో ₹36 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన మండల విద్యాశాఖ (MEO) కార్యాలయ భవనాన్ని మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు.

ఈ నూతన కార్యాలయం ద్వారా విద్యా పరిపాలన మరింత సమర్థవంతంగా సాగి విద్యార్థులు, ఉపాధ్యాయులకు మెరుగైన సేవలు అందనున్నాయి.

ఈ సందర్భంగా ప్రజా సేవల బలోపేతానికి గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పంచాయతీలకు 25 ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. అలాగే మండలంలో గల సచివాలయాలకు ₹1,92,500 విలువైన 17 UPSలను అందజేశారు.

విద్య, గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్యం, ప్రజా సంక్షేమం—ఈ నాలుగు రంగాల్లో సమగ్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పెరకున్నారు

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU

Next Story