Narsannapeta: పోలాకి మండలంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే!
Narsannapeta: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం మబగాంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి.
Narsannapeta: పోలాకి మండలంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే!
Narsannapeta: ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు స్వయంగా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేసిన - నరసన్నపేట శాసనసభ్యులు శ్రీ బగ్గు రమణమూర్తి గారు. సమాజంలో అత్యంత వెనుకబడిన నిరుపేదలు, వృద్ధులు, వితంతువులు, మరియు దివ్యాంగులకు కొండంత అండగా నిలుస్తూ, వారి సంక్షేమానికి ప్రజాప్రభుత్వం (కూటమి ప్రభుత్వం) అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ఉద్ఘాటించారు.
గురువారం పోలాకి మండలం మబగాం కాలనీలో అత్యంత వైభవంగా నిర్వహించిన "ఎన్టీఆర్ భద్రత పింఛన్ల" పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ఆయన స్వయంగా పింఛను సొమ్మును అందజేసి, వారి యోగక్షేమాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్క అర్హులైన పేదవాడు సంక్షేమ పథకాలకు దూరం కాకూడదనే స్పష్టమైన లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.వృద్ధాప్యం, వైకల్యం, వితంతువుల కష్టాలను గుర్తించి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచేందుకు పింఛన్ల మొత్తాన్ని పెంచడమే కాకుండా ప్రతి నెలా ఒకటో తేదీనే క్రమం తప్పకుండా అందిస్తున్నామని చెప్పారు.
రాజకీయాభిప్రాయాలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడమే ప్రభుత్వ నైతిక బాధ్యత అని ఉద్ఘాటించారు.గ్రామీణ స్థాయిలో ప్రజ ఎదుర్కొంటున్న మౌలిక వసతులు, ఇతర సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలని ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి, క్షేత్రస్థాయి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు అధికారులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




