Narsannapeta: జాతీయ స్థాయిలో పతకం సాధించిన విద్యార్థికి అభినందనలు!

Narsannapeta: జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో రజత పతకం సాధించిన విద్యార్థి రెడ్డి భార్గవ్‌ను అభినందించిన నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి.

TANDASI KIRAN, NARASANNAPETA
Published on: 9 Oct 2026 12:29 PM IST
Narsannapeta
X

Narsannapeta: జాతీయ స్థాయిలో పతకం సాధించిన విద్యార్థికి అభినందనలు!

Narsannapeta: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, భిలాయ్‌లో ఈ నెల 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు నిర్వహించిన 45వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. ఈ జట్టులో నరసన్నపేట మహాత్మా జ్యోతిబా పూలే బి.సి. గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థి రెడ్డి భార్గవ్ ప్రతిభ కనబరిచి పతక విజయంలో కీలక పాత్ర పోషించాడు.

జాతీయ స్థాయిలో రాణించి నియోజకవర్గానికి, పాఠశాలకు మంచి పేరు తెచ్చిన క్రీడాకారుడు రెడ్డి భార్గవ్‌ను పోలాకి మండలం, కత్తిరివానిపేటలోని క్యాంప్ కార్యాలయంలో నరసన్నపేట శాసనసభ్యులు శ్రీ బగ్గు రమణమూర్తి గారు ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణించడం అభినందనీయమని కొనియాడారు.భవిష్యత్తులో భార్గవ్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశస్థాయిలో సత్తా చాటాలని ఆకాంక్షించారు.క్రీడాకారులకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బి. రాయికన్నా గారు, మాజీ సర్పంచ్ రావాడ చంద్రమౌళి గారు, మండల పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి రెడ్డి పాపారావు గారు, విద్యార్థిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

TANDASI KIRAN, NARASANNAPETA

TANDASI KIRAN, NARASANNAPETA