Jalumuru: రామచంద్రాపురంలో ఎత్తిపోతల పథకం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం!
Jalumuru: జలుమూరు మండలం రామచంద్రాపురంలో మరమ్మత్తులు పూర్తి చేసుకున్న ఎత్తిపోతల పథకం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రారంభించారు.
Jalumuru: రామచంద్రాపురంలో ఎత్తిపోతల పథకం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం!
Jalumuru: జలుమూరు మండలం, రామచంద్రాపురం గ్రామంలో నిలిచిపోయిన ఎత్తిపోతల పథకానికి నూతన ఊపిరి పోస్తూ, మరమ్మత్తులు పూర్తి చేసుకున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను నరసన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బగ్గు రమణమూర్తి గారు స్థానిక రైతులతో కలసి బుధవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బగ్గు రమణమూర్తి గారు మాట్లాడుతూ గత కొంతకాలంగా ట్రాన్స్ఫార్మర్ ప్రాకేజీ విఫలమై, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రామచంద్రాపురం మరియు దాని పరిసర ప్రాంతాల రైతాంగం తీవ్ర సాగునీటి ఎద్దడిని ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. పంటలు ఎండిపోయే ఉన్న తరుణంలో, ఈ సమస్యను గౌరవ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన తక్షణమే స్పందించారని తెలిపారు. కేంద్ర మంత్రివర్యులు తన ప్రత్యేక నిధుల నుంచి రూ. 8.35 లక్షలు కేటాయించి, విద్యుత్ శాఖ అధికారులను సమన్వయం చేస్తూ అత్యంత వేగవంతంగా మరమ్మత్తు పనులు పూర్తయ్యేలా చేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




