Kaviti: ఇచ్చాపురం నియోజకవర్గంలో పచ్చిరొట్టె విత్తనాల పంపిణీ ప్రారంభం
Kaviti: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలంలో 50% రాయితీపై పచ్చిరొట్టె విత్తనాల పంపిణీని ఎమ్మెల్యే బెందాళం అశోక్ ప్రారంభించారు.
Kaviti: ఇచ్చాపురం నియోజకవర్గంలో పచ్చిరొట్టె విత్తనాల పంపిణీ ప్రారంభం
కవిటి: వ్యవసాయ భూముల భూసారాన్ని పెంపొందించి, సాగు ఖర్చులను తగ్గిస్తూ రైతులకు మెరుగైన దిగుబడులు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన పచ్చిరొట్టె విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చాపురం నియోజకవర్గంలో శ్రీకారం చుట్టారు. 50 శాతం రాయితీపై అందిస్తున్న ఈ విత్తనాల పంపిణీని ప్రభుత్వ విప్, స్ధానిక ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ గురువారం కవిటి మండలం రామయ్యపుట్టుగ ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చిరొట్టె పంటల సాగు వల్ల భూమిలో సేంద్రియ పదార్థాలు పెరిగి నేల సారవంతం అవుతుందని, తద్వారా రసాయన ఎరువుల వినియోగం తగ్గి రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే ప్రతి పథకాన్ని గ్రామ స్థాయికి చేర్చే దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు.
నియోజకవర్గంలోని వివిధ మండలాలకు అవసరమైన మేరకు జీలుగా, కట్టే జనుము, పిల్లి పెసర విత్తనాలను సిద్ధంగా ఉంచినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. కవిటి మండలానికి 114 క్వింటాళ్ల జీలుగా, 77 క్వింటాళ్ల కట్టే జనుము, మూడు క్వింటాళ్ల పిల్లి పెసర విత్తనాలు కేటాయించారు. సోంపేట మండలానికి 174 క్వింటాళ్ల జీలుగా, 51 క్వింటాళ్ల కట్టే జనుము విత్తనాలు, కంచిలి మండలానికి 73 క్వింటాళ్ల జీలుగా, 6 క్వింటాళ్ల కట్టే జనుము విత్తనాలు, ఇచ్చాపురం మండలానికి 14 క్వింటాళ్ల జీలుగా, 5 క్వింటాళ్ల కట్టే జనుము విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
50 శాతం రాయితీ అనంతరం 10 కిలోల జీలుగా విత్తనాల బస్తా ధర రూ.800 కాగా, కట్టే జనుము బస్తా ధర రూ.770గా నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు ఆధార్ కార్డు ఆధారంగా తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాలు లేదా గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి విత్తనాలు పొందవచ్చని సూచించారు.
కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు బెందాళం రమేష్, పొందల కృష్ణారావు, ఏఎంసీ చైర్మన్ మణిచంద్ర ప్రకాష్,కాళింగ కార్పొరేషన్ డైరెక్టర్ బార్ల చిన్నబాబు, పీఏసిఎస్ చైర్మన్ ఎర్ర బాస్ దేవ్, తెదేపా సీనియర్ నాయకులు సీపాన వెంకటరమణ, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
వ్యవసాయ భూముల భూసారాన్ని పెంపొందించి, సాగు ఖర్చులను తగ్గిస్తూ రైతులకు మెరుగైన దిగుబడులు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన పచ్చిరొట్టె విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చాపురం నియోజకవర్గంలో శ్రీకారం చుట్టారు. 50 శాతం రాయితీపై అందిస్తున్న ఈ విత్తనాల పంపిణీని ప్రభుత్వ విప్, స్ధానిక ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ గురువారం కవిటి మండలం రామయ్యపుట్టుగ ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.