Palasa: అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు, వంట పాత్రల పంపిణీ!

Palasa: నియోజకవర్గ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (ICDS) ఆధ్వర్యంలో ఇండక్షన్ స్టవ్‌లు, వంట పాత్రల పంపిణీ కార్యక్రమం జరిగింది.

B LOKANADHAM, PALASA
Published on: 15 July 2026 10:45 PM IST
Palasa
X

Palasa: అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు, వంట పాత్రల పంపిణీ!

పలాస: నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని మరింత మెరుగ్గా అందించాలనే ఉద్దేశంతో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (ఐసిడీఎస్) ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు మరియు వంట పాత్రల పంపిణీ కార్యక్రమం ఈరోజు పలాస ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ పలాస శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష గారు లబ్ధిదారులకు ఇండక్షన్ స్టవ్లు, వంట పాత్రలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష గారు మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు బలమైన పునాదులని అన్నారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పరిశుభ్రమైన వాతావరణంలో పోషకాహారం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకోసం అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం దశలవారీగా కల్పిస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గ పరిధిలోని మందస మండలంలోని 176 అంగన్వాడీ కేంద్రాలకు, అలాగే పలాస మరియు వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలోని 189 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు మరియు వంట పాత్రలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ పంపిణీ ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో వంట ప్రక్రియ మరింత సులభతరమై, పరిశుభ్రంగా నిర్వహించడానికి వీలుకానుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, ఐసిడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, అంగన్వాడీ సూపర్‌వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, , పాల్గొన్నారు.

B LOKANADHAM, PALASA

B LOKANADHAM, PALASA

Next Story