Palasa: పర్యాటక రంగంపై ఎమ్మెల్యే గౌతు శిరీష ఫోకస్!

Palasa: పలాస నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే గౌతు శిరీష అడుగులు వేస్తున్నారు.

B LOKANADHAM, PALASA
Published on: 20 April 2026 4:30 PM IST
Palasa
X

Palasa: పర్యాటక రంగంపై ఎమ్మెల్యే గౌతు శిరీష ఫోకస్!

Palasa: పలాస నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే గౌతు శిరీష నడుం బిగించారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ మరియు అటవీశాఖ ఉన్నతాధికారులతో కలిసి అటవీ ప్రాంతాల్లోని స్థలాలను పరిశీలించారు. పర్యాటక ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన అనుమతులు, అటవీ భూముల వినియోగంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రభుత్వ లక్ష్యం కేవలం అభివృద్ధి మాత్రమే కాదని, ప్రకృతిని కాపాడుకుంటూనే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమేనని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా త్వరలోనే మరిన్ని నిధులు మంజూరు చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.ఎమ్మెల్యే, కలెక్టర్ మరియు అటవీశాఖ అధికారుల మధ్య సమన్వయంతో సాగిన పర్యటన.నగరవనం పూర్తి స్థాయిలో పనులు చేపట్టి ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి తిసుకువస్తాం అని తెలిపారు.

B LOKANADHAM, PALASA

B LOKANADHAM, PALASA

Next Story