Palasa: పలాసలో కూటమి ప్రభుత్వ కార్యక్రమాలపై ఎమ్మెల్యే గౌతు శిరీష సమీక్ష

Palasa: స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలని ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపు. కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

B LOKANADHAM, PALASA
Published on: 12 Aug 2026 7:09 AM IST
Palasa
X

Palasa: పలాసలో కూటమి ప్రభుత్వ కార్యక్రమాలపై ఎమ్మెల్యే గౌతు శిరీష సమీక్ష

Palasa: పలాస ఎమ్మెల్యే గారి కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ క్యాడర్‌తో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణుల సన్నద్ధత, క్షేత్రస్థాయిలో సమన్వయం, ప్రజలతో మరింత మమేకమై పనిచేయాల్సిన అంశాలపై ఎమ్మెల్యే గారు నాయకులు, చర్చించారు.

అదేవిధంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన డోర్ టు డోర్ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డులో ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో, సమన్వయంతో పనిచేస్తూ కూటమి ప్రభుత్వ పాలన, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని శ్రీమతి గౌతు శిరీష గారు అన్నారు.

ఈ సమావేశంలో నియోజకవర్గ పార్టీ నాయకులు, మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

B LOKANADHAM, PALASA

B LOKANADHAM, PALASA

Next Story