Pathapatnam: పాతపట్నంలో కూటమి తరఫున ఎమ్మెల్యే ఎంజీఆర్ ప్రచారం
Pathapatnam: పాతపట్నం మండల కేంద్రంలోని 1, 2, 3, 4 ఎంపీటీసీ సెగ్మెంట్లలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు (ఎంజీఆర్) ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Pathapatnam: పాతపట్నంలో కూటమి తరఫున ఎమ్మెల్యే ఎంజీఆర్ ప్రచారం
పాతపట్నం: పాతపట్నం మండల కేంద్రంలో గల 1,2,3,4, ఎంపీటీసీ సిగ్మీంట్ పరిధిలో ఎన్డీఏ కూటమి బలపరిచిన మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ఎంపీటీసీలు), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (జడ్పీటీసీ) అభ్యర్థుల తరఫున నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు మామిడి గోవిందరావు.
ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలను, కుటుంబాలను నేరుగా కలిసి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గురించి వివరించి, వారికి మద్దతు తెలియజేయాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమ లక్ష్యాలతో ముందుకు సాగుతున్న కూటమి అభ్యర్థులకు ప్రజల మద్దతు కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




