Palakonda: గిరిజన రైతులకు అండగా ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ

Palakonda: సీతంపేట ఐటీడీఏలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ.

KAILASH SAHU, PALAKONDA
Published on: 23 Jun 2026 12:31 PM IST
Palakonda
X

Palakonda: గిరిజన రైతులకు అండగా ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ

Palakonda: పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ సీతంపేట ITDA ప్రాంగణంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజలు వినిపించిన సమస్యలపై సంబంధిత అధికారులతో అక్కడికక్కడే చర్చించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం SCA to TSS (2018-19 & 2019-20) పథకం కింద గిరిజన రైతుల అభివృద్ధి కోసం మంజూరైన వ్యవసాయ యంత్ర పరికరాలను అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ స్వయంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, గిరిజన రైతులు ఆర్థికంగా మరింత బలోపేతం కావడానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని, రైతుల అభ్యున్నతే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. అనంతరం రైతులకు వ్యవసాయ విత్తనాలను పంపిణీ చేశారు.

అలాగే మత్స్య శాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు మోపెడ్‌లు (Mopeds), ఐస్ బాక్స్‌లు (Ice Boxes) మరియు చేపల వలలను పంపిణీ చేసి, వారి జీవనోపాధి మరింత మెరుగుపడాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ గారు మాట్లాడుతూ, “ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి గిరిజనరైతు,మత్స్యకార కుటుంబానికి చేరేలా నిరంతరం కృషి చేస్తాననితెలిపారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయంపాలకొండ అభివృద్ధే లక్ష్యం, రైతు బాగుంటే గ్రామం బాగుంటుంది… గిరిజన రైతు అభివృద్ధే పాలకొండ అభివృద్ధి” అని ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ గారు తెలిపారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story