Palakonda: జంపర్ కోట బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కళావతి

Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలంలోని జంపర్ కోట గ్రామానికి చెందిన ప్రమాద బాధితులను మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పరామర్శించారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 1 May 2026 3:45 PM IST
Palakonda
X

Palakonda: జంపర్ కోట బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కళావతి

పాలకొండ: మాజీ ఎమ్మెల్యే కళావతి బాధితులకు పరామర్శ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ మండలంలోని జంపర్ కోట గ్రామానికి చెందిన ప్రమాద బాధితులను మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి శుక్రవారం స్థానిక ఏరియా ఆసుపత్రిలో పరామర్శించారు. ఒక్కొక్కరిని పరామర్శించి జరిగిన ఘటన వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

బాధితులంతా నిరుపేదలని ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. డి సి హెచ్ ఎస్ నాగభూషణరావు తో మాట్లాడి చిన్నారులకు తక్షణ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు అండగా వైఎస్ఆర్సిపి పార్టీ ఉంటుందని మనోధర్యంతో ఉండాలని భరోసా కల్పించారు. మృతదేహాలకు త్వరగా పోస్టుమార్టం పూర్తి చేసి వారి బంధువులకు అందించాలని వైద్యులకు సూచించారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story