Seetampeta: ఐటీడీఏ అధికారుల తీరుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీవ్ర అసంతృప్తి!

Seetampeta: ప్రభుత్వ నిబంధనలు, ప్రోటోకాల్ పాటించకపోవడంపై సీతంపేట ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో మండిపడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 1 Oct 2026 11:54 AM IST
Seetampeta
X

Seetampeta: ఐటీడీఏ అధికారుల తీరుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీవ్ర అసంతృప్తి!

Seetampeta: సీతంపేట ఐటిడిఏలో పొలిటికల్ గవర్నెన్స్ అమలు కాకపోవడం పట్ల ఉమ్మడి జిల్లాలకు చెందిన శాసనసభ్యులు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు అధికారులు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిన సంబంధిత ఎమ్మెల్యేలకు ముందస్తు సమాచారం అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆ దిశగా సీతంపేట ఐటిడిఏలో అమలు జరగడంలేదని ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సాక్షాత్తు సీతంపేట ఐటిడిఏ పాలకవర్గ సమావేశంలోనే ఈ అంశాన్ని పలాస, పాలకొండ, పాతపట్నం, అమదాలవలస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు తమ ఆవేదాన్ని వ్యక్తం చేశారు. ఐటీడీఏలో శాఖల వారీగా వార్షిక బడ్జెట్ ఎంత వస్తుంది? దేని కింద ఖర్చు చేస్తున్నారు? అనేది స్పష్టత లేకపోవడం పట్ల శాసనసభ్యులు అసంతృప్తి చెందుతున్నారు.

కనీసం పథకాలు లబ్ధిదారులకు చేరవేయడంలో కూడా ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వలన తమకు సమాచారం లేక ప్రజలుకు స్పష్టంగా తెలియజేయలేని పరిస్థితి ఉందన్నారు.

జిల్లాల పునర్విభజన తర్వాత ఈ పరిస్థితి ఎక్కువగా ఉండడంతో అధికారులు ఒక్కొక్కరికి మూడేసి శాఖలకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడం పని భారం అధికంగా ఉండడం వలన పూర్తిస్థాయి సమాచారం ఇవ్వలేని పరిస్థితి నెలకొందని అధికారులే స్పష్టం చేస్తున్నారు. ఐటీడీఏ పీవోలు కూడా ఇన్చార్జ్లతో నెట్టుకురావడం పాలనాపరమైన లోపాలు కనిపించడంతో ప్రజాప్రతినిధులు అసంతృప్తి చెందుతున్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA