Kanchili: నిమ్మాసిని అమ్మవారి సన్నిధిలో ఎమ్మెల్సీ నర్తు రామారావు!
Kanchili: కంచిలి మండలం ఎస్‌ఆర్‌సీ పురంలో వెలిసిన నిమ్మాసిని అమ్మవారిని ఎమ్మెల్సీ నర్తు రామారావు దర్శించుకున్నారు.
Kanchili: నిమ్మాసిని అమ్మవారి సన్నిధిలో ఎమ్మెల్సీ నర్తు రామారావు!
కంచిలి: గ్రామీణ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన కంచిలి మండలం ఎస్‌ఆర్‌సీ పురం గ్రామ నిమ్మాసిని అమ్మవారి ఆలయంలో గురువారం భక్తి వాతావరణం నెలకొంది. శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు రామారావు ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజల సుఖసంతోషాలు, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఇటీవల గ్రామంలో నూతనంగా పునర్నిర్మించిన అమ్మవారి ఆలయం భక్తులతో కళకళలాడుతుండగా, ప్రతిష్ఠ మహోత్సవాలకు హాజరు కాలేకపోయిన ఎమ్మెల్సీ మారువారంలో ఆలయానికి విచ్చేసి భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయంగా రూ.10 వేల ఆర్థిక విరాళాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి, మాజీ సర్పంచ్ డొక్కరి బలరాంకు అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ నర్తు రామారావుకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని, గ్రామ దేవతల ఆలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తానని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




