Palakonda: రాజన్న పాలన రామరాజ్యం.. కులమతాలతీతంగా సంక్షేమం!
Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గ కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Palakonda: రాజన్న పాలన రామరాజ్యం.. కులమతాలతీతంగా సంక్షేమం!
పాలకొండ: నియోజకర్గంలో పాలకొండ చెక్ పోస్ట్ సెంటర్ వద్ద స్వర్గీయ శ్రీ వై.యస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి 77వ జయంతి పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి
ఘన నివాళులు అర్పించిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు శ్రీ పాలవలస విక్రాంత్ మాజీ శాసనసభ్యులు శ్రీమతి విశ్వాసరాయి కళావతి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి
కులమతాలతీతంగా సంక్షేమంతో తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహానేత అని నీ జననం చరిత్ర మరువలేనిదని నీ మరణం సరిపోల్చలేని నీ ప్రస్థానం అని చెరగని నీ చిరునవ్వు సజీవంగా ప్రజల గుండెల్లో ఉంటుందని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ప్రజల పక్షాన పాలన ఎలా ఉండాలో చూపించిన గొప్ప నాయకుడు శ్రీ వైయస్సార్ గారు పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం కల అనుకుంటే ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి వారి కలను నిజం చేసిన డాక్టర్ వైయస్సార్ గారు
ఉన్నత చదువులు కొనలేమిని భావించిన సరస్వతీ పుత్రులకు ఫీజు రియంబర్స్మెంట్ వరం కలి పించిన ఘనత శ్రీ వైయస్సార్ కు దక్కినది
దేశానికి వెన్నుముక వ్యవసాయం అని బలంగా విశ్వసించి సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి. జలయజ్ఞం ప్రారంభించిన అపర భగీరథుడు శ్రీ వైయస్సార్ గారు
రైతు రుణాలు మాఫీ చేసి లక్షల రైతుల కుటుంబాలకు వెలుగు నింపి,వారికి ఉచిత విద్యుత్ కల్పించిన శ్రీ వైయస్సార్ గారు
108 అంబులెన్స్ సర్వీసులు మరియు ట్రిపుల్ ఐటీ లను ఏర్పాటు చేసి ఎన్నో ప్రజా ప్రయోజన కార్యక్రమంలు చేపట్టి తన ప్రజారంజక పాలనతో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు
అందుకే ఆయన రాజకీయ నాయకుడు కాదు రాజన్న పాలన రామరాజ్యాన్ని తలపించిందని ప్రజలు అంటారని వారు ఈ సందర్భంగా స్మరించుకున్నారు.




