Srikakulam: కన్న కూతుర్నే కడతేర్చి గుండె పోటుగా చిత్రీకరించిన కన్న తల్లి!

Srikakulam: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో దారుణం. కన్న కూతురిని హత్య చేసి గుండెపోటుగా నమ్మించిన తల్లి, మామ.

RAMBABU, TEKKALI
Published on: 10 Jun 2026 1:39 PM IST
Srikakulam
X

Srikakulam: కన్న కూతుర్నే కడతేర్చి గుండె పోటుగా చిత్రీకరించిన కన్న తల్లి!

Srikakulam: టెక్కలి మండలం సొర్లిగాం గ్రామం లో దారుణ మైన ఘటన, హత్యకు ముందు కుటుంబ సభ్యుల మీద అనుమానంతో మృతురాలు పంపిన సెల్ఫీ వీడియో ఆధారంగా మృతురాలి ప్రియుడు హైదరాబాద్ లో ఇచ్చిన పిర్యాదు తో పోలీసుల దర్యాప్తు.

వివరాల్లోకి వెళ్తే

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం లింగాలవలస పంచాయతీ సొర్లిగాం గ్రామానికి చెందిన దుంపల హరిణి w/o దాంతెస్వరరావు, గ్రూప్ పరీక్షల నిమిత్తం హైదరాబాద్ కి వెళ్లగా అక్కడ సుధా నాగేంద్ర అనే వ్యక్తితో పరిచయం కాగా అది అక్రమ సంబంధానికి దారి తీసింది.

ఇదే విషయం తల్లి విజయ కుమారి, మామ బలుసాకు, భర్త దంతేశ్వరరావు మరియు కుటుంబ సభ్యులు నిలధీయగా వాగ్వాదం చోటు చేసుకుంది, 2026 సంవత్సరం ఫిబ్రవరి లో హైదరాబాద్ బాలానగర్ పోలీస్ స్టేషన్ లో హరిణి పిర్యాదు చేసింది మరియు భర్త తో విడాకులు కూడా కోరింది.

పరువు పోతుందని భావించిన కుటుంబ సబ్యులు పథకం ప్రకారం మృతురాలు అయిన హరిణి నీ సొర్లిగాం గ్రామానికి పిలిపించి 01-06-2026 తేదీన రాత్రి మంచం పై పడుకున్న హరినీని తల్లి, మామ హత్య చేసి భౌతిక ఆధారాలన్నీ రూపుమాపు చేసి హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి గ్రామస్తులను నమ్మించారు, దహన సంస్కారాలు కూడా రాత్రికి రాత్రి పూర్తిచేసి ఆత్మహత్యగా చిత్రీకరణ, మృతురాలు ప్రియుడు సుధా నాగేంద్ర హైదరాబాద్ లో ఇచ్చిన ఫిర్యాదుతో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు టెక్కలి పోలీసులు దర్యాప్తు మరియు విచారణ చేయడంతో తామే హత్య అని ఒప్పుకున్నారు.

RAMBABU, TEKKALI

RAMBABU, TEKKALI

Next Story