Kanchili: మండల పరిషత్ సర్వసభ్య సమావేశం – ప్రజా సమస్యలపై చర్చ
Kanchili: కంచిలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పంటల బీమా రుసుములు, PHC వైద్య సేవలపై ప్రజాప్రతినిధుల సుదీర్ఘ చర్చ.
Kanchili: మండల పరిషత్ సర్వసభ్య సమావేశం – ప్రజా సమస్యలపై చర్చ
కంచిలి: మండలంలోని పలు ప్రజా సమస్యలపై కంచిలి మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సర్వసభ్య సాధారణ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఎంపీడీవో తిరుమలరావు సమక్షంలో ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలు, ప్రభుత్వ సేవలపై సభ్యులు చర్చించారు.
రైతులకు పంటల బీమా చేయించుకునే సమయంలో మీసేవ కేంద్రాల్లో అధిక మొత్తంలో రుసుములు వసూలు చేస్తున్నారన్న అంశాన్ని సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సంబంధిత వ్యవసాయ అధికారితో విచారణ చేపట్టి వాస్తవాలను పరిశీలించాలని, అధిక రుసుములు వసూలు చేస్తున్నట్లు తేలితే నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే ఎంఎస్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండటం లేదన్న విషయాన్ని సభ్యులు ప్రస్తావించారు. సెలవు రోజుల్లోనూ ప్రజలకు వైద్య సేవలు అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
అనంతరం వ్యవసాయం, వైద్యం, విద్య, తాగునీరు, పారిశుద్ధ్యం, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలకు సంబంధించిన అంశాలపై శాఖల వారీగా




