Kanchili: ఓటీపీ రాకపోయినా L1 డివైస్‌తో రైతులకు యూరియా!

Kanchili: మండలం భోగాబెని ఆర్బీకే పరిధిలో ఎంపీడీఓ తిరుమలరావు పర్యవేక్షణలో L1 బయోమెట్రిక్ డివైస్ ద్వారా రైతులకు యూరియా పంపిణీ విజయవంతంగా జరిగింది.

G.RAMBABU, SOMPET
Published on: 20 July 2026 11:49 PM IST
Kanchili
X

Kanchili: ఓటీపీ రాకపోయినా L1 డివైస్‌తో రైతులకు యూరియా!

కంచిలి: కంచిలి మండలం భోగాబెని రైతు సేవా కేంద్రం పరిధిలో యూరియా పంపిణీ కార్యక్రమం సోమవారం ప్రశాంతంగా జరిగింది. మండల పరిషత్ అభివృద్ధి అధికారి తిరుమలరావు పంపిణీని స్వయంగా పర్యవేక్షించారు. ఓటీపీ రాని రైతులకు ఇబ్బంది లేకుండా L1 డివైస్ తో బయోమెట్రిక్ విధానంలో యూరియా అందించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఏపీఏఐఎంఎస్ యాప్, ఐఎఫ్ఎంఎస్ తో పంపిణీ ప్రక్రియ పూర్తి చేశారు. తక్కువ విస్తీర్ణం కలిగిన రైతులు, కౌలు రైతులు, ఒకే కుటుంబ సభ్యులందరినీ క్లబ్ చేసి సరఫరా చేశారు. దీంతో ఎవరికీ ఇబ్బంది లేకుండా అందరికీ యూరియా అందించారు.

రైతులకు సూచనలు, ఈ సందర్భంగా అధికారులు రైతులకు పలు సూచనలు చేశారు. రైతులందరూ తమ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ అనుసంధానం చేసుకోవాలని కోరారు. యూరియాను ఒకేసారి వేయకుండా మూడు దఫాలుగా వాడాలని సూచించారు. డీఏపీ బదులుగా 20:20:0:13, 28:28:0 వంటి కాంప్లెక్స్ ఎరువులను వినియోగించుకోవాలని తెలిపారు. మొక్కకు కావలసిన పోషకాలను కాంప్లెక్స్, సూటి ఎరువుల రూపంలో అందించవచ్చని వివరించారు. భూమిలో సేంద్రీయ పదార్థం ఎక్కువగా ఉంటే పోషకాల లభ్యత, మొక్క వినియోగించుకునే సామర్థ్యం పెరుగుతుందని రైతులకు అవగాహన కల్పించారు. పంపిణీ కార్యక్రమంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story