Srikakulam: క్విజ్ పోటీల్లో మెరిసిన ఎంఎస్ పల్లి మోడల్ స్కూల్ విద్యార్థినులు!

Srikakulam: కంచిలి మండలస్థాయి క్విజ్ పోటీల్లో ఎంఎస్ పల్లి మోడల్ స్కూల్ విద్యార్థినులు పల్లవి, సిరి, నఫీషావళ్లి ప్రతిభ కనబరిచి నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

G.RAMBABU, SOMPET
Published on: 10 Nov 2026 11:14 AM IST
Srikakulam
X

Srikakulam: క్విజ్ పోటీల్లో మెరిసిన ఎంఎస్ పల్లి మోడల్ స్కూల్ విద్యార్థినులు!

Srikakulam: కంచిలి విద్యా ప్రతిభకు పోటీల్లో మరోసారి గుర్తింపు లభించింది. కంచిలి మండలస్థాయిలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో ఎంఎస్ పల్లి మోడల్ స్కూల్‌కు చెందిన పల్లవి, సిరి, నఫీషావళ్లి ప్రతిభ కనబరిచి నియోజకవర్గస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఒకే పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు ఈ అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విద్యాశాఖ ఆదేశాల మేరకు సోమవారం స్థానిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు మండలస్థాయి పోటీలు నిర్వహించారు. వ్యాసరచన, చిత్రలేఖనం, గానం, క్విజ్ తదితర అంశాల్లో నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

క్విజ్ విభాగంలో మెరుగైన ప్రతిభ కనబరిచిన ఆరుగురిలో ముగ్గురిని తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేయగా, ఎంఎస్ పల్లి మోడల్ స్కూల్ విద్యార్థినులు ఆ జాబితాలో చోటు సంపాదించారు.

విజేతలైన విద్యార్థినులను మండల విద్యాశాఖ అధికారులు ఎస్. శివరామప్రసాద్, కె. చిట్టిబాబు అభినందించారు. భవిష్యత్తులోనూ విద్యా, విజ్ఞాన పోటీల్లో రాణిస్తూ ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET