Palakonda: పాలకొండలో మున్సిపల్ కార్మికుల ధర్నా జీతాలు పెంచాలని డిమాండ్!

Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో మున్సిపల్ కార్మికుల జీతాల పెంపు, 12వ పీఆర్సీ ఏర్పాటు కోరుతూ సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 30 Sept 2026 8:08 AM IST
Palakonda
X

Palakonda: పాలకొండలో మున్సిపల్ కార్మికుల ధర్నా జీతాలు పెంచాలని డిమాండ్!

Palakonda: మున్సిపల్ కార్మికులకు జీతాల పెంపు, 12 వ పిఆర్‌సి కమీషన్ ఏర్పాటు, కాంట్రాక్ట్ ఔట్స్‌సోర్సింగ్ కార్మికులకు డిఎ, మధ్యంతరభృతి వర్తింపచేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు )పాలకొండ కమిటీ ఆధ్వర్యంలో నగర పంచాయతీ కార్యాలయం ఆవరణలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాలరమణారావు మాట్లాడుతూ

రాష్ట్రంలోని 123 మున్సిపాల్టీలలో విధులు నిర్వహిస్తున్న 60 వేలమంది ఉద్యోగులు, కార్మికులు గత 3 ఏళ్ళుగా జీతాల పెంపు కోసం, 12 వ పిఆర్‌సి వేతనాలకోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 12 వ పిఆర్‌సి కమీషన్‌ను ఏర్పాటుచేయాలి. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు పిఆర్‌సి జీతాలు, డిఎ, మరియు కరువుభత్యం వర్తింపచేయాలి అన్నారు. .

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలను అదుపుచేయటంలేదు. గత 8 ఏళ్ళల్లో అన్ని రకాల ధరలు వందలరెట్లు పెరిగాయి. రూపాయి విలువ దిగజారీపోయింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కరెంట్‌చార్జీలు రెట్టింపు అయ్యాయి. పిల్లల విద్యా ఫీజులు, వైద్య ఖర్చులు, ఇంటి అద్దెలు అమాంతంగా పెరిగిపోయాయి.

అయితే ఉద్యోగులు, కార్మికుల జీతాలు ప్రభుత్వాలు సకాలంలో పెంచడంలేదు. గత 11 వ పిఆర్‌సి ని రెండేళ్ళు ఆలస్యంగా అమలుచేశారు. ప్రస్తుతం 12 వ పిఆర్‌సి ని ఏర్పాటుచేయడంలేదు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు ఏళ్ళతరబడి జీతాలు పెరగకపోవడం వల్ల జీవితాంతం నష్టపోతున్నారు. మరోవైపు టిఎ, డిఎని, మధ్యంతరభృతి మొదలగు సౌకర్యాలు కల్పించి కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను ఆదుకోవాలని సమస్యలు పరిష్కారం కొరకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI