Palasa: పలాసలో టీడీపీ కీలక సమావేశం.. మున్సిపల్ పోరుకు యాక్షన్ ప్లాన్!
Palasa: రానున్న మున్సిపల్ ఎన్నికలపై కీలక సన్నద్ధత సమావేశం జరిగింది. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో పార్టీ విజయమే లక్ష్యంగా బూత్ స్థాయి కార్యాచరణను ఖరారు చేశారు.
Palasa: పలాసలో టీడీపీ కీలక సమావేశం.. మున్సిపల్ పోరుకు యాక్షన్ ప్లాన్!
పలాస: నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గారి కార్యాలయంలో పలాస తెలుగుదేశం పార్టీ సమన్వయ కర్త శ్రీ వెంకన్న చౌదరి ఆధ్వర్యంలో రానున్న మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు, వార్డు ఇన్‌చార్జీలు హాజరయ్యారు.ఈ సందర్భంగా వెంకన్న చౌదరి మాట్లాడుతూ, రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రతి వార్డులో పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు.
నాయకులు ఐకమత్యంతో ముందుకు సాగితే రానున్న ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
సమావేశంలో నాయకులు తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించగా, ఎన్నికల నిర్వహణ, బూత్ స్థాయి కార్యాచరణ, పార్టీ సంస్థాగత బలోపేతంపై విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశంలో ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు , ఏఎంసీ చైర్మన్ మల్ల శ్రీనివాసరావు , రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లోడగల కామేష్ , పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ అధ్యక్ష కార్యదర్శులు మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, వార్డు ఇన్‌చార్జీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు




