Narasannapeta: సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను పునఃప్రారంభించిన ఎమ్మెల్యే
Narasannapeta: నరసన్నపేట పట్టణంలో నిలిచిపోయిన ప్రధాన రహదారి సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఘనంగా పునఃప్రారంభించారు.
Narasannapeta: సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను పునఃప్రారంభించిన ఎమ్మెల్యే
నరసన్నపేట: నరసన్నపేట పట్టణం ప్రధాన రహదారిపై గత కొంతకాలంగా సాంకేతిక సమస్యల వల్లన నిలిచిపోయిన సెంట్రల్ లైటింగ్ (రహదారి మధ్య దీపాలు) వ్యవస్థను పునరుద్ధరించి, నరసన్నపేట శాసనసభ్యులు శ్రీ బగ్గు రమణమూర్తి గారు స్విచ్ ఆన్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కమిటీ సభ్యులు, క్లస్టర్ ఇంచార్జ్లు, యూనిట్ ఇంచార్జలు మరియు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ అనుబంధ కమిటీ సభ్యులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




