Narasannapeta: నరసన్నపేటలో 'చెప్పాం.. చేస్తున్నాం' కరపత్రాల ఆవిష్కరణ!

Narasannapeta: Narasannapeta: MLA Baggu Ramanamurthy Releases NDA Pamphletఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, టిడిపి నేత బగ్గు అర్చన 'చెప్పాం.. చేస్తున్నాం' కరపత్రాలను ఆవిష్కరించి, కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

TANDASI KIRAN, NARASANNAPETA
Published on: 20 Oct 2026 6:27 AM IST
Narasannapeta
X

Narasannapeta: నరసన్నపేటలో 'చెప్పాం.. చేస్తున్నాం' కరపత్రాల ఆవిష్కరణ!

Narasannapeta: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిపై నమ్మకంతో ప్రజలు 94 శాతం స్ట్రైక్ రేట్‌తో చారిత్రాత్మక విజయాన్ని అందించారని, అదే నమ్మకాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగిస్తూ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గారు పిలుపునిచ్చారు.నరసన్నపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ‘చెప్పాం.. చేస్తున్నాం..’ పేరుతో రూపొందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సహకారంతో, మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు.

చెప్పడం మాత్రమే కాదు.. చెప్పిన ప్రతి మాటను చేతల్లో చూపిస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

TANDASI KIRAN, NARASANNAPETA

TANDASI KIRAN, NARASANNAPETA