Srikakulam: సమాచార శాఖలో ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే వేడుకలు

Srikakulam: శ్రీకాకుళం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్స్ డే ఘనంగా నిర్వహించారు.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 15 Sept 2026 5:01 PM IST
Srikakulam
X

Srikakulam: సమాచార శాఖలో ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే వేడుకలు

శ్రీకాకుళం: భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖలో ఇంజనీర్స్ డే వేడుకలను నిర్వహించారు. డి.ఐ.పి.ఆర్.ఓ కె. చెన్నకేశవరావు , డి.పి.ఆర్.ఓ ఎస్.జానకమ్మ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమం లో సహాయ ఇంజనీర్లు కె.పుణ్యవతి, ఎం.అప్పలనాయుడు, ఏ.వి. సూపర్వైజర్ బి. మురళీ మోహన్, టెక్నీషియన్ ఉమా మహేశ్వర రావు, సీనియర్ అసిస్టెంట్ టి.కృష్ణ రాజు, టైపిస్ట్ పి.రామోజీ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.