Srikakulam: కిడ్నీ వ్యాధి మూలాలను అన్వేషిస్తున్న నీతి ఆయోగ్!
Srikakulam: నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ కె. శ్రీనివాసరావు, ఇచ్చాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్‌బాబు కిడ్నీ బాధితులను పరామర్శించారు.
Srikakulam: కిడ్నీ వ్యాధి మూలాలను అన్వేషిస్తున్న నీతి ఆయోగ్!
శ్రీకాకుళం: కవిటి మండలం బల్లిపుట్టుగ గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న జయసేన బిసాయి, సరస్వతి బిసాయి, ఎర్ర బృందావన్‌లను నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ కె. శ్రీనివాసరావు, ఇచ్చాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్‌బాబు ఆదివారం వారి నివాసాలకు వెళ్లి పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుతం అందుతున్న వైద్య సేవలు, చికిత్స విధానం, ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కుటుంబాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గ్రామంలో కిడ్నీ వ్యాధులు ప్రబలడానికి గల కారణాలపై బాధితులు, వారి కుటుంబ సభ్యులు, వైద్య అధికారులు, స్థానికులతో చర్చించి వివరాలు సేకరించారు. తాగునీటి నాణ్యత, జీవన విధానం, స్థానిక పరిస్థితులు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో ఆరా తీసిన డాక్టర్ కె. శ్రీనివాసరావు, సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా సమగ్ర అధ్యయనం చేపట్టి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్‌బాబు మాట్లాడుతూ కిడ్నీ బాధిత కుటుంబాలకు అవసరమైన వైద్య సేవలు, మందులు, పరీక్షలు నిరంతరంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.




