Kaviti: కవిటిలో ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ!

Kaviti: శ్రీకాకుళం జిల్లా కవిటి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు.

G.RAMBABU, SOMPET
Published on: 1 Sept 2026 5:55 PM IST
Kaviti
X

Kaviti: కవిటిలో ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ!

కవిటి: కవిటి మండలం కవిటి గ్రామంలోని బెహరా వీధిలో లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛను నగదును టీడీపీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా మండల టీడీపీ నాయకులు, మాజీ జెడ్పీటీసీ బెందాళం రమేష్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఏ మధుబాబు, కవిటి పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు వజ్జ రంగారావు, బీ చక్రధర్ రావు, కమలహాసన్, బెహరా లక్ష్మణ్, బెహరా గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story