Palakonda: పాలకొండలో ఇంధన కొరత రూమర్స్‌పై అధికారుల తనిఖీలు

Palakonda: పాలకొండలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న రూమర్స్ నేపథ్యంలో అధికారులు బంకులను తనిఖీ చేసి ప్రజలకు అపోహలు వద్దని సూచించారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 29 April 2026 7:20 AM IST
Palakonda
X

Palakonda

Palakonda: పెట్రోల్, డీజిల్ కొరతపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడంతో పాలకొండ పట్టణంలో ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై పరిస్థితిని సమీక్షించారు.

ఎస్టిపిఓ ఎం. రాంబాబు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, తహసిల్దార్ రాధాకృష్ణమూర్తి సంయుక్త బృందంగా ఏర్పడి పాలకొండలోని అన్ని పెట్రోల్ బంకులను సందర్శించారు. బంకుల వద్ద పరిస్థితిని పరిశీలించి యాజమాన్యాలకు తగిన సూచనలు జారీ చేశారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బంకుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందని వస్తున్న వార్తలు అసత్యమని అధికారులు స్పష్టం చేశారు.

అన్ని పెట్రోల్ బంకుల వద్ద సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, కొంతమంది బంకులకు ఇంధన ట్యాంకర్లు కూడా చేరుతున్నాయని తెలిపారు. ప్రజలు అపోహలకు లోనుకాకుండా సాధారణంగా అవసరమైనంత మాత్రమే ఇంధనం తీసుకోవాలని సూచించారు.

అదేవిధంగా బాటిల్లు, క్యాన్లు, డ్రమ్‌ల ద్వారా ఇంధనం తీసుకెళ్లరాదని, ఈ విషయంలో బంకు యాజమాన్యాలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story