Palakonda: పాలకొండలో పల్స్ పోలియో కేంద్రాల తనిఖీ..కమిషనర్ కీలక ఆదేశాలు

Palakonda:పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పాలకొండ పట్టణంలోని సచివాలయాలు, ఆసుపత్రులు, ఆర్టీసీ కాంప్లెక్స్ పరిధిలో జరుగుతున్న జాతీయ పల్స్ పోలియో.

KAILASH SAHU, PALAKONDA
Published on: 28 Jun 2026 2:00 PM IST
Palakonda
X

Palakonda: పాలకొండలో పల్స్ పోలియో కేంద్రాల తనిఖీ..కమిషనర్ కీలక ఆదేశాలు

పార్వతీపురం: మన్యం జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు పాలకొండ పట్టణంలో గల సచివాలయాల్లో, హాస్పిటల్లో, ఆర్టీసీ కాంప్లెక్స్ మొదలకు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని కమిషనర్ శ్రీ పి.వి నూకరాజు గారు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. 0-5 ఏళ్లలోపు వయసు గల (ఐదేళ్ల లోపు పిల్లలకు) పల్స్ పోలియో వేయించడమే ప్రధాన లక్ష్యమన్నారు.

ఈ మేరకు జూన్ 28 (నేడు) పట్టణమంతా ఏర్పాటుచేసిన ప్రత్యేక పోలియో బూతులలో చిన్నారులకు చుక్కల మందు వేయనున్నట్లు ఈరోజు రాలేకపోయిన మిగిలిన పిల్లల కోసం జూన్ 29,30 తేదీల్లో సిబ్బంది నేరుగా ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని కమిషనర్ గారు వివరించారు.

ప్రయాణాల్లో ఉండే పిల్లల కోసం ఆర్టీసీ కాంప్లెక్స్ లోనూ ఏర్పాటు చేశామన్నారు.

పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని తద్వారా పోలియో రహిత సమాజం నిర్మితమవుతుందని అన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story