Palakonda: చట్టాన్ని నిర్వీర్యం చేస్తే మరో సాయుధ పోరాటం తప్పదు జేఏసీ!
Palakonda: విలేకరుల సమావేశంలో 1/70 చట్టాన్ని పకడ్బందీగా చేయాలని, సుప్రీంకోర్టు కేసులో ఏపీ ప్రభుత్వం వెంటనే ఇంప్లీడ్ పిటిషన్ వేయాలని ఆదివాసీ నేతలు డిమాండ్ చేశారు.
Palakonda: చట్టాన్ని నిర్వీర్యం చేస్తే మరో సాయుధ పోరాటం తప్పదు జేఏసీ!
పాలకొండ: ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబ. యోగి మాట్లాడుతూ.
ఒక్కసారి చరిత్రలోకి వెళితే 1/70 చట్టం రాడానికి 1968 సంవత్సరంలో శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతాంగ పోరాట ఫలితమే ఈ 1/70 చట్టం.ఆనాడు ఉమ్మడి శ్రీకాకుళం,విజయనగరం ఉమ్మడి జిల్లాలో ఆదివాసీ ప్రాంతాలలో ఉన్న భూములను గిరిజనేతరులు ఆక్రమించుకుంటే పోరన్న, మంగన్నలు ఈ అడివి మాదే ఈ అడవిలో భూమి మాదే అని నినాదంతో ఉద్యమిస్తే ఆనాడు భూస్వాములు కొరన్న,మంగన్నలను తుపాకితో కాల్చి చంపారు. ఆకాల్పులను వ్యతిరేకిస్తూ ఆదిభట్ల కైలాసం,వెంకటపు సత్యం, ఆదివాసీలు కలిసి పోరాటాన్ని పిలుపునిచ్చారు.
అదే శ్రీకాకుళ గిరిజన సాయుధ పోరాటం.ఈ పోరాటంలో సుమారుగా 300 మంది ఆదివాసులు,ఆదిభట్ల కైలాసం,వెంకటపు సత్యం, అమరులయ్యారు.ఈ పోరాట ఫలితమే 1/70 చట్టం,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది ఐటిడిఎలు ఏర్పడ్డాయి.ఆనాటి ప్రభుత్వం ఆలోచింపజేసి గిరిజనుల కోసం ప్రత్యేకమైన చట్టం తేవాలని ఆలోచన చేసి 1/70 చట్టం అనేది తీసుకొస్తే 03-02-1970 న రాష్ట్ర గవర్నర్,రాష్ట్రపతి ఆమోదంతో వచ్చిన 1/70 చట్టం.మాఆదివాసీ భూములను కాపాడటానికి తెచ్చిన చట్టం
కొంతమంది గిరిజనేతరులు 1/70 రద్దు చేయాలని కోర్టుకు వెళ్ళారు.1/70 రద్దు అయితే మా తాత ముత్తాతల నుండి వచ్చిన భూములు,మా అడవులు, మా జలాలు అన్ని బడా కంపెనీలకు,రియల్ ఎస్టేట్ వాళ్ళకు పోతాయి. మూలవాసులు వలస పోవాల్సి వస్తుంది. ఆడవులను ఆదాని,ఆంబానిలు కాజేయడానికి ఎదురుచూస్తున్నారని
రాజ్యాంగం ఏం చెప్తుంది "రాజ్యాంగం 5వ షెడ్యూల్, ఆర్టికల్ 244 ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాల్లో గిరిజనేతరులు భూములు కొనకూడదని.ఆదివాసిలకు ప్రత్యేక భూహక్కులు కల్పించాలని సుప్రీంకోర్టు 1997లో సమతా జడ్జిమెంట్ ముగ్గురు జడ్జిలతో సుప్రీంకోర్టు తీర్పులో కూడా ఇదే చెప్పిందని వాబ.యోగి అన్నారు.
జేఏసీ జిల్లా అధ్యక్షులు బిడ్డీక.శ్రీను మాట్లాడుతూ,ఈరోజు ఈ ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేస్తున్నాం.1/70 చట్టనికి వ్యతిరేకంగా గిరిజనేతరులు సుప్రీంకోర్టులో వేసిన కేసు పై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆయొక్క కేసులో రాష్ట్ర ప్రభుత్వ స్వయంగా ఇంప్లిడ్ పిటిషన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.
ఒకవేళ జీవో నెంబర్-3 నిర్వీర్యం చేసినట్టు ఈ 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనలు ఉంటే మరో శ్రీకాకుళం సాయుధ పోరాటానికి సిద్ధమని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.శ్రీను అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ కార్యదర్శి బిడ్డక ఉమామహేశ్వరరావు,తిరుమలరావు,ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కమిటీ సభ్యుడు, సవర.సింహచలం, మిన్నరావు,సవర. వెంకటరమణ,సవర.పేతురు, కొండదొర.వినోద్, యోగేష్, శ్రీకాంత్, భాస్కర్, కాంతారావు, గోపి, తదితరులు పలుగున్నారు.




