Palakonda: పాలకొండ ఆర్టీసీ డిపో ఎదుట ఉద్యోగుల ధర్నా

Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఏపీఎస్ ఆర్టీసీ డిపో ఎదుట ఏపీపీటీడీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు భారీ నిరసన చేపట్టారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 23 Jun 2026 8:00 PM IST
Palakonda
X

Palakonda: పాలకొండ ఆర్టీసీ డిపో ఎదుట ఉద్యోగుల ధర్నా

పాలకొండ: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీపిటిడి జేఏసి పిలుపు మేరకు ఆర్టీసీ డిపో ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెండింగ్ లోఉన్న డిఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బస్సులు ఆర్టీసీ పరిధిలో ఉంచాలని అన్నారు.

జేఏసీ జోనల్ కార్యదర్శి బి.కి మూర్తి మాట్లాడుతూ విద్యుత్ బస్సులకి ఈ జేఏసీ వెతిరేఖం కాదని, ప్రభుత్వానికి వెతిరేకం కాదు అని ఇప్పటికే విద్యుత్ బస్సులకు సంబంధించి ఇప్పటికే 12 డిపోలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసి వారి ద్వారా నడిపించాలని చూస్తున్నట్టు ప్రణాళికలను వెతిరేకిస్తున్నాట్టు తెలిపారు.

ఆర్టీసీ సంస్థ ద్వారా విద్యుత్ బస్సులు నడపాలనీ జేఏసీ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. గతంలో మాదిరిగా ఈ.హచ్.ఎస్ రెఫరల్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.28వ తేదీన విజయవాడ లో భవిష్యత్తు కార్యాచరణ పై జెఎసి చర్చలు జరుపుతారని తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలన్నారు.

జేఏసీ జోనల్ మెంబర్ ఏం.వైకుంఠం మాట్లాడుతూ 40 సంవత్సరాలగా ప్రజా రవాణా ను ఏపీఎస్ ఆర్టీసీ గుర్తింపుగా ప్రజలకు సేవలు అందిస్తున్న తరుణంలో ఆర్టీసీ ని ప్రైవేటీకరణ చేసి నిర్వీర్యం చేయాలని చూస్తున్నట్టు తెలిపారు.దాన్ని వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగుల, కార్మికులు పాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story