Palakonda: ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల సామూహిక వినతిపత్రం
Palakonda: పాలకొండలో కనీస వేతనాలు, సంక్షేమ పథకాలు కోరుతూ ఆశా వర్కర్లు సామూహిక రాయబారంలో భాగంగా ఎమ్మెల్యే కార్యాలయం వద్ద వినతిపత్రం సమర్పించారు.
Palakonda: ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల సామూహిక వినతిపత్రం
పాలకొండ: కేంద్ర ప్రభుత్వం 2014 నుండి వేతనాలు పెంచని ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు అమలు చేయాలని సంక్షేమ పథకాలు అమలు కోరుతూ సామూహిక రాయబారం కార్యక్రమంలో భాగంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో పాలకొండ నియోజకవర్గం కేంద్రంలో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కే గౌరీశ్వరి సిఐటియు జిల్లా అధ్యక్షులు ధావాల రమణారావు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయాలని ,కమ్యూనిటీ హెల్త్ వర్కర్లని ఆశ వర్కర్లుగా మార్చాలని ,ఆశాలకు మెడికల్ లీవులు ,ప్రభుత్వ సెలవులు అమలు చేయాలని ,ఆశలకు ఇచ్చిన హామీలు మేరకు జీవోలు ఇచ్చి ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని, ఆశలను 10 లక్షలు గ్రూప్ ఇన్సూరెన్స్ చెల్లించాలని, గ్రాడ్యుటి సీలింగ్ ఎత్తివేయాలని ,నాణ్యమైన యూనిఫారం ఇవ్వాలని, జనాభా కనుగుణంగా
ఆశా వర్కర్లు నియమించాలని ఆశలకు సంబంధం లేని పనులు అప్పగించరాదని తదితరు సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కాదా రాము, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు ఎస్ లక్ష్మి , ఎస్ మాలతి, కమల, శిరీష ,సిహెచ్ భాగ్యలక్ష్మి ,చిట్టెమ్మ ,లక్ష్మి, శారద ,ఎస్ శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి సామూహికంగా ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్ వరకు నియోజకవర్గంలో ఉన్న ఆశ ,కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




