Palakonda: మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులపై కేసులే.. డీఎస్పీ

Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో మద్యం మత్తులో ఆటో నడిపి ఒకరి మృతికి కారణమైన డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 19 May 2026 4:39 PM IST
Palakonda
X

Palakonda: మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులపై కేసులే.. డీఎస్పీ

Palakonda: సోమవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో వ్యక్తి మరణించడంతో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి డిఎస్పీ మాట్లాడుతూ సోమవారం సాయంత్రం సుమారు 16:30 గంటల సమయంలో పాలకొండ వీరఘట్టం బి.టి. రోడ్డులోని రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ సమీపంలో, పాలకొండ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్యకు సమానంకాని నరహత్య (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టూ మర్డర్ ) కు సంబంధించిన కేసు. ఈ విషయమై అదే రోజు రాత్రి సుమారు 21:00 గంటలకు ఫిర్యాదుదారు అయిన కల్లూరి గౌరీశ్వరమ్మ,

W/o లేటు అప్పలరాము, వయస్సు సుమారు 53 సంవత్సరాలు, పద్మశాలి కులస్తురాలు, తలవరం గ్రామం, వీరఘట్టం మండలం నివాసి నివేదిక సమర్పించారు. ఫిర్యాదుదారు తన భర్తతో కలిసి పై చిరునామాలో నివసిస్తూ, తన భర్త బట్టలు వ్యాపారం ద్వారా జీవనం సాగించేవాడని, 18.05.2026 తేదీన తన భర్త వ్యాపార పనుల నిమిత్తం పాలకొండ పట్టణానికి వెళ్లినట్లు తెలిపింది. పనులు ముగించుకుని తిరిగి పాలకొండ నుండి తలవరం గ్రామానికి AP 30 TC 5309 నంబరు గల ఆటో రిక్షాలో ప్రయాణిస్తూ,

వీరఘట్టం జంక్షన్ దాటి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ సమీపానికి చేరుకున్నప్పుడు, ఆ ఆటో రిక్షా డ్రైవర్ అయిన తాలాడ మోహనరావు, తండ్రి: లేటు చెల్లయ్య, వయస్సు సుమారు 37 సంవత్సరాలు, రజక కులం, బెజ్జి గ్రామం, పాలకొండ మండలం నివాసి మద్యం త్రాగిన మత్తులో, ట్రాఫిక్ నియమాలను పాటించకుండా మరియు ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ఆటోను నడిపి ఆ క్రమంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న AP 39 WP 5210 నంబరు గల మరో ఆటో రిక్షాను ఢీకొట్టాడు.

దాంతో ఫిర్యాదుదారుడి భర్తతో పాటు రెండు ఆటో రిక్షాల్లో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు కూడా తీవ్ర గాయాలు పొందారు. అనంతరం గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం ఏరియా హాస్పిటల్, పాలకొండకు తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఫిర్యాదుదారుడి భర్త ఛాతి మరియు కాలర్బాన్ భాగాలలో తీవ్ర గాయాలు, అంతర్గత రక్తస్రావం కారణంగా మృతి చెందినట్లు తెలిపింది. ఈ ప్రమాదం ఆటో రిక్షా డ్రైవర్ మద్యం త్రాగిన మత్తులో, అధిక వేగంతో, ప్రమాదకరంగా మరియు నిర్లక్ష్యంగా వాహనం నడపడం వలననే జరిగిందని, తద్వారా ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడంతో పాటు తన భర్త మృతికి కారణమయ్యాడని ఫిర్యాదుదారు పేర్కొంది.

తదుపరి ఆటో డ్రైవర్ ను రాత్రి 11 గంటలకు రాబడిన నమ్మకమైన సమాచారం ప్రకారం అరెస్ట్ చేసి పాలకొండ పోలీస్ స్టేషన్ నందు ఉంచడమైనది. ఈ రకంగా ఎవరైనా మద్యం మత్తులో వాహనాలు నడిపితే వారికి ఇదే విధంగా చట్టపరంగా తీసుకుని చర్యకు బాధ్యుల కుదరని ఈ పత్రిక సభ ముఖంగా అందరు డ్రైవర్లకు హెచ్చరించడమైనది అని అన్నారు ఈ సమావేశంలో సిఐ ఏ ప్రసాద్ రావు ఎస్ ఐ డి వెంకన్న పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story