Palakonda: పాలకొండ జెడ్పీ స్కూల్‌లో అగ్నిమాపక శాఖ అవగాహన సదస్సు
Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ జెడ్పీ హైస్కూల్‌లో అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది.
Palakonda: పాలకొండ జెడ్పీ స్కూల్‌లో అగ్నిమాపక శాఖ అవగాహన సదస్సు
Palakonda: పాలకొండ, పెద్దకాపు వీధి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అగ్నిమాపక అవగాహన సదస్సును ఏర్పాటు చేయడమైనది. ఏదైనా ప్రమాదం ప్రాథమిక దశలో ఉండేటప్పుడే అగ్నిమాపక కేంద్రానికి 101 ద్వారా సమాచారం అందజేయవలసిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు వర్షాకాలం చెరువులు లోతు ఎక్కువగా ఉండే సందర్భంగా కనుక చెరువుల దగ్గరకు స్నానాలకు, ఈతలకు, సరదాలకు వెళ్లకూడదని సూచించడమైనది.
అగ్నిమాపక పరికరాలను ఉపయోగించే పద్ధతులపై, ఎల్పిజి గ్యాస్ వాడకం, నిర్వహణ పై పలు సూచనలు చేయడమైనది. ఎల్పిజి లీక్ జరిగిన సందర్భంలో చేపట్టవలసిన చర్యలు మరియు ఎల్పిజి మంటలు ఏర్పడేటప్పుడు ఎల్పిజి మంటలను అధిక పీడనంతో నీటితో కొట్టి ఆర్పుట, తడి గుడ్డతో గట్టిగా కొట్టి ఆర్పుట మొదలగు పద్ధతులపై తర్ఫీది ఇవ్వడమైనది. ఈ కార్యక్రమంలో పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు మరియు సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




